Sapota | శరీరం బలహీనంగా ఉన్నప్పుడు రెండు లేదా మూడు సపోటా పండ్లు (Chiku Fruit )తీసుకుంటే మంచిది. పెరటి పండైన సపోటాలో సమృద్ధిగా లభించే ఫ్రక్టోస్ శరీరంలో త్వరగా శక్తిని పెంచేలా చేస్తుంది.అలాగే సపోటాలో కార్బోహైడ్రేట్లు, పోషకాలు అధికంగా ఉంటాయి కాబట్టి మహిళలు గర్భధారణ సమయంలో ఈ పండును తింటే అరోగ్యానికి చాలా మంచిది. సపోటా రక్తస్రావ నివారిణి కనుక పైల్స్ సమస్య ఉంటే ఈ పండ్లు తినటం వలన ఈ సమస్య దూరం అవుతుంది.
సపోటాలో యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం రక్తపోటును తగ్గించేదుకు చాలా ఉపయోగపడుతుంది. షుగర్ పేషంట్స్ అయితే ఈ పండ్లకు దూరంగా ఉండటం చాలా ఉత్తమం. సపోటా ఇంకా ఎన్నో సమస్యల నుంచి బయటపడేలా చేస్తుందని వైద్యులు అంటున్నారు. సపోటా ప్రూట్‌తో స్థూలకాయం, ఊబకాయ, జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు, నిద్రలేమి సమస్యలను సపోటా పండు దూరం చేస్తుంది.ఇక ఈ పండ్లలో విటమిన్ ఏ, బి, సి పుష్కలంగా ఉంటాయి.
విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సపోటాలో కాపర్, ఐరన్, ఫాస్పరస్, క్యాల్షియం, నియాసిస్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి అనేక రోగాలను నయం చేస్తాయి. కంటి చూపును మెరుగుపరచడంలో కూడా సపోటా ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీనిలోని క్యాల్షియం ఎముకల బలానికి తోడ్పడుతుంది.అంతేకాదు.. రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్‌ను కంట్రోల్ ఉంచుతుంది.
కీటకాలు కుట్టినప్పుడు చర్మభాగంపై సపోటా విత్తనాల పేస్ట్ రాసుకుంటే నొప్పి తగ్గిపోతుంది. సపోటా విత్తనాల నూనెను తలకు రాసుకుంటే.. జుట్టు రాలే సమస్య ఉండదు. సపోటాలు తినటం వలన వికారం తగ్గుతుంది. అందుకే గర్భిణీలు సపోటాను తినటం మంచిదని నిపుణులు అంటున్నారు. సపోటా తినటం వల్ల శ్లేష్మం శరీరం నుండి బయటకు వస్తుంది. ఇంకా సపోటా పండులో గ్లూకోజ్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరుకు చాలా ఉపయోగపడుతుంది. సపోటాలోని విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది.
Also Read : దానిమ్మ పండు తింటే ఇన్నిఅనారోగ్యాలను దూరం అవుతాయా..
సపోటా పండు ప్రయోజనాలు..
సపోటాలో సహజమైన గ్లూకోజ్ అధికంగా ఉంటుంది. ఈ పండు తింటే శరీరానికి శక్తిని ఇస్తుంది. సపోటాలో ఉండే విటమిన్ ఎ, బి, ఇ చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది. సపోటాలోని విటమిన్ ఎ ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్ నుంచి కాపాడుతుంది. ఈ పండ్లలో ఎముకలను బలపరిచే కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ వంటి ఎక్కవగా ఉన్నాయి.
అలాగే రక్తహీనత ఉన్నవారు, గర్భిణులు, వయోవృద్దులు తరచూ సపోటా పండ్లను తింటే శరీరానికి అవసరమైన ఇనుము అంది రక్తహీనత నుంచి బయటపడతారు. ఇందులో పొటాషియం, మెగ్నీషియం గుండెకు కూడా ఎంతో మేలు చేస్తాయి.ఖర్జూరాలను సపోటాల్లో చేర్చి జ్యూస్ రూపంలో తీసుకున్నా.. లేదంటే సపోటాను నేరుగా తిన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రక్తపోటును తగ్గించడంలోనూ కీలకంగా వ్యవహరిస్తుంది. సపోటాలోని మెగ్నిషియం రక్తనాళాల పనితీరును క్రమబద్దీకరిస్తుంది. పొటాషియం రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేసి, రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
హైబీపీ
సపోటాల్లో ఉండే మెగ్నిషియం రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. ఈ పండ్లలో ఉండే పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది. బీపీని నియంత్రణలో ఉంచుతుంది. రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. సపోటాల్లో ఉండే ఐరన్ వల్ల రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. రక్తం బాగా తయారవుతుంది.
అందానికి
సపోటాలను తరచూ తినడం వల్ల శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. చర్మం, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే సపోటాలను తినడం వల్ల కొల్లాజెన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో ముఖంపై ఉండే ముడతలు తగ్గుతాయి. ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు.
నిద్రలేమి సమస్య..
నిద్రలేమి, అందోళనతో ఇబ్బందులు పడే వ్యక్తులు సపోటా తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. అలాగే జలుబు, దగ్గు తగ్గడానికి కూడా దోహదం చేస్తుంది. అంతే కాకుండా కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను తొలగించడానికి సపోటా సహాయపడుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. స్థూలకాయ సమస్యకు సపోటా విరుగుడుగా పనిచేస్తుందట.
రోగనిరోధక శక్తి
విటమిన్ సి వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా లభించడం వల్ల ఎముకల గట్టిదనంతోపాటు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే ఆరోగ్యానికి మేలు చేసే నియాసిన్, కాపర్, ఐరన్ లాంటి మూలకాలు కూడా ఇందులో ఉన్నాయి.
వీళ్ళు తినకపోవడమే మంచిది.
సపోటాలో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే వీటిని కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తినకపోవడమే మంచిది. ఈ మధ్యకాలంలో పిల్లలతో శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటారు.శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్నపిల్లలకు సపోటా పండు తినిపించడం వల్ల వారి సమస్యలు అధికమయ్యే అవకాశం ఉంటుంది. మధుమేహ సమస్యలతో బాధపడేవారు సపోటాలను తక్కువగా తినాలి లేదా తినకపోవడమే మంచిది. వీటిలో ఉండే తియ్యటి పరిమాణం వల్ల ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. సాధారణ వ్యక్తులు కూడా రోజుకు రెండు సపోటాలు మాత్రమే తీసుకోవాలి. వీటిని అధిక మోతాదులో తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు సపోటాలకు దూరంగా ఉండటం మంచిది.
క్యాన్సర్ నిరోధక లక్షణాలు..
క్యాన్సర్ నిరోధక లక్షణాలు సపోటా కలిగి ఉంది. రోమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించటంలో సహాయపడుతుంది. సపోటాలో ఉండే మిథనాలిక్ క్యాన్సర్ కణితుల పెరుగుదలను ఆపుతుంది. కడుపులో ఉబ్బరం, గ్యాస్, కడుపునొప్పి వంటి జీర్ణసంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు. చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచటంతోపాటు, ప్రకాశవంతంగా మార్చటంలో సహాయపడుతుంది. మెదడుకు తగినంత ఆక్సిజన్ అందించటం ద్వారా డిప్రెషన్, టెన్షన్ వంటి వాటిని సపోటా తీసుకోవటం వల్ల పోగొట్టుకోవచ్చు.