Onion | ఉల్లిగడ్డ వలన ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయో తెలుసా?

Onion | ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదన్న సామెత మీరు వినే ఉంటారు. ఉల్లి ఒంటికి చలువ చేస్తుందని చెబుతుంటారు. అలాగే మన వంట గదిలో ఎప్పడూ ఉండేది.. అన్ని కూరల్లో తప్పకుండా వేసుకునేది ఉల్లిపాయ. ఇవి కూరకు మంచి రుచిని అందిస్తాయి. గ్రేవీని పెంచడంలోనూ తోడ్పడుతుంది. అయితే రోజూ కర్రీలో వేసుకునే ఉల్లిపాయలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ఉల్లిపాయలో యాంటిబయోటిక్, ఏంటి సెప్టిక్, యాంటీమైక్రోబియాల్ లక్షణాలు ఉండుట వలన ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.

ఉల్లిపాయలో సల్ఫర్, ఫైబర్, పొటాషియం, విటమిన్ బి, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. అలాగే కొవ్వు, కొలెస్ట్రాల్ మరియు సోడియం తక్కువగా ఉంటాయి. ప్రతి రోజు మజ్జిగన్నంలో ఉల్లిపాయ తింటే గుండె వ్యాధులకు కారణం అయిన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. అంతేకాక మంచి కొలస్ట్రాల్ ను పెంచి కొరోనరీ వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుంది. దంతాల నొప్పి మరియు పిప్పి పన్ను నొప్పి నివారణకు మజ్జిగన్నంలో ఉల్లిపాయ తింటే చాలు. పెరుగన్నంలో లేదా మజ్జిగన్నంలో ఉల్లిపాయను ఉపయోగించటం వలన మంచి జ్ఞాపకశక్తి మరియు ఒక బలమైన నాడీ వ్యవస్థ ఏర్పడుతుంది. ఇక అన్నింటి కన్నా ముఖ్యమైనది మజ్జిగన్నంతో ఉల్లిపాయ తింటే యవ్వనంగా ఎప్పటికి మగతనం తగ్గకుండా ఉంటుంది.

ఎముకల ఆరోగ్యానికి..

ఉల్లిపాయల్లో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వన్నీ కూడా ఎముకల ఆరోగ్యానికి మంచిది. ఇందులోని క్వెర్సెటిన్, సల్ఫర్ కంటెంట్ ఎముకల సాంద్రతని నిర్వహించడానికి, ఎముకలు దెబ్బతినకుండా నిరోధించడంలో సాయపడుతుంది. ఆహారంలో ఉల్లిపాయల్ని చేర్చుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

యాంటీ మైక్రోబియల్ గుణాలు..

ఉల్లిపాయల్లో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉన్నాయి. ఇందులోని అల్లిసిన్, సల్ఫర్ వంటి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే ఇమ్యూనిటీని పెంచి ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి.

ప్రిబయోటిక్స్..

ఉల్లిపాయల్లో ఓ రకమైన పీచు పదార్థం ఉంటుంది. ఇవి ప్రీ బయోటిక్‌గా పనిచేస్తాయి. ప్రీ బయోటిక్స్ గట్‌ బ్యాక్టీరియాకి చాలా మంచిది. జీర్ణక్రియని మెరుగ్గా చేసి పోషకాల శోషణకి హెల్ప్ చేసి మొత్తం గట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఉల్లిపాయల్ని రెగ్యులర్‌గా తీసుకుంటే గట్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ అవుతుంది.

జీర్ణవ్యవస్థ

ఫైబర్ అధికంగా ఉండే ఉల్లిపాయను పచ్చిగా తిన్నా.. వండుకుని తిన్నా సులభంగా అరుగుతుంది. ఇది మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. అలాగే దీంట్లోని ప్రీబయోటిక్స్ పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది.ఉల్లిలో అధిక మోతాదులో ఉండే సల్ఫర్, పొటాషియం, విటమిన్ బి, విటమిన్ సి, పీచు పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఉల్లి కీళ్లకు, గుండెకు మేలు చేస్తుంది. ఉల్లి గడ్డలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. అందుకే వైద్య, ఆరోగ్య సంస్థలు ఔషదాల తయారీలో వీటిని వాడుతున్నాయి. ఉల్లి రసం, తేనె కలిపి తీసుకుంటే జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి త్వరగా తగ్గిపోతాయి.

Also Read : నిమ్మరసం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకోండి..!

మధుమేహంతో బాధపడే వారు పచ్చి ఉల్లిపాయలను తినం ఎంతో మంచిది. ఉల్లి గడ్డ ఇన్సూలిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే క్రోమియం రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రణ ఉంచుతుంది. జ్ఞాపకశక్తిని పెంచడానికి, గుండె జబ్బులను దూరం చేయడానికి ఉల్లి మంచి ఔషదం. రక్త నాళాల్లో రక్తం గడ్డకడితే గుండె పోటు ఇతరాత్ర సమస్యలు రావచ్చు. అయితే, ఉల్లి శరీరంలోని రక్తం పల్చగా ఉంచి కణాలు స్వేచ్ఛగా ప్రవహించేందుకు దోహదం చేస్తుంది. గుండె జబ్బులు, బీపీతోనూ బాధపడే వాళ్లు రోజూ ఉల్లిని తీసుకోవటం చాలా మంచిది.

ఉల్లి గడ్డల్లోని సల్ఫర్ సమ్మేళనాలు ఆస్త్మాకు కారణమయ్యే బయో కెమికల్ చెయిన్ ఫార్మేషన్‌ను నిలిపివేస్తుందని పరిశోధనల్లో తేలింది. దగ్గుతో బాధపడేవారు నోరు ఆరిపోకుండా ఉండేందుకు ఉల్లిని తీసుకోవడం ఉత్తమం. జాండీస్, కామెర్ల నివారణకు కూడా ఉల్లి ఉపయోగపడుతుంది.

Also Read : మునగ ఆకు,పువ్వుతో కూడా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా

శతాబ్దాలుగా ఉల్లిపాయను ఆయుర్వేద చికిత్సకు ఉపయోగిస్తున్నారు. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొంతమంది వేసవిలో జలుబు, దగ్గు, కడుపు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటారు. కానీ ఉల్లిపాయలను ఎక్కువగా తినడం వల్ల నోటిపూత, గొంతు మంట వంటి సమస్యలు వస్తాయి.కొంతమందికి ఇది అలెర్జీ కావచ్చు.. దీనివల్ల చర్మంపై ఎర్రటి దద్దుర్లు, కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉల్లిపాయను తిన్న తర్వాత ఏవైనా సమస్యలు ఉంటే.. ఖచ్చితంగా డాక్టర్లని సంప్రదించాలి. కావున.. వేసవిలో ప్రతిరోజూ పరిమిత పరిమాణంలో ఉల్లిపాయలను తినాలి నిపుణులు చెబుతున్నారు.

Leave a comment