Pomegranate | దానిమ్మ పండు తింటే ఇన్నిఅనారోగ్యాలను దూరం అవుతాయా..

Pomegranate | నిజానికి చాలా మంది డాక్టర్లు తమ వద్దకు వచ్చిన రోగులకు దానిమ్మ గింజలను తినాలని సూచిస్తారు. పలు పరిశోధనల ప్రకారం దానిమ్మ గింజలు, అధిక రక్తపోటు, ఎక్కువ కొలెస్ట్రాల్, ఆక్సిడేటివ్ స్ట్రెస్, వాపులు వంటి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలను నియంత్రించటం, తగ్గించటం చేస్తాయి. ఇక దానిమ్మ గింజలను నేరుగా పచ్చిగా తింటారు లేదా దానిమ్మ రసం తీసుకుని తాగుతారు. ఒక దానిమ్మ పండులో దాదాపు 600 వరకు గింజలు ఉంటాయి.వీటిల్లో పోషకాలు చాలా నిండుగా ఉంటాయి. ఇవి శరీరం లోపల, బయట, ఆరోగ్యానికి చాలా సానుకూల ప్రభావాలు చూపిస్తుంది.

దానిమ్మ గింజలలో విటమిన్ బి, సి, కె, ఇంకా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇంకా పొటాషియం, క్యాల్షియం వంటి పలు రకాల మినరల్స్ కూడా వీటిలో ఉంటాయి. దానిమ్మ గింజల నూనెలో ప్యూనిసిక్‌ ఆమ్లం ఉంటుంది. ఇతర పండ్లలో ఇది దొరకదు. ఈ నూనెలో ఈస్ట్రోజెన్‌ అధికంగా ఉంటుంది. ఈస్ట్రోజెన్‌ స్థాయులు తక్కువగా ఉండే.. మెనోపాజ్‌ దశలోని మహిళలకు దానిమ్మ గింజల తైలం ఎంతో మంచిది. దానిమ్మ గింజలు మనల్ని అతినీలలోహిత (అల్ట్రా వయోలెట్‌) కిరణాల నుంచి కాపాడతాయి. అలా చర్మ క్యాన్సర్‌ రాకుండా నివారిస్తాయి.

రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, శరీరంలో రోగ నిరోధక శక్తిని దెబ్బతీసే ఆటో ఇమ్యూన్‌ వ్యాధుల నివారణలో దోహదపడతాయి. చిగుళ్లను బలోపేతం చేయడం, దంతక్షయం ముప్పును నివారించడం ద్వారా దంతాల ఆరోగ్యానికి హామీ ఇస్తాయి.అలాగే దానిమ్మ తింటే గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక శారీరక సమస్యల్ని దూరం చేస్తాయి. దానిమ్మలో దీర్ఘకాలిక సమస్యలు దూరమవుతాయి.ఈ పండు తింటే బాడీలో మంట తగ్గుతుంది.

దానిమ్మలో పాలీఫెనోలిక్ గుణాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.ఇంకా దానిమ్మతో స్మూతీలు, ఫ్రూట్‌ సలాడ్లు, జ్యూస్‌లు, ఫుడ్డింగ్‌, ఐస్‌క్రీములు లాంటివి తయారు చేసుకోవచ్చు. సలాడ్‌ కోసం ఏవైనా పండ్లముక్కలతోపాటు దానిమ్మ గింజలను ఒక బౌల్‌లో తీసుకోవాలి. దానికి చిటికెడు జీలకర్ర పొడి, మిరియాల పొడి, తాజా పుదీనా ఆకులు, రెండు టేబుల్‌ స్పూన్ల నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమానికి తరిగిన కీరదోస ముక్కలు జోడించుకోవాలి. తర్వాత సగం కప్పు యోగర్ట్‌ కలుపుకోవాలి. యోగర్ట్‌ మీద మళ్లీ కొన్ని దానిమ్మ గింజలను చేర్చాలి. ఆపైన వాల్‌నట్స్‌ వేసుకోవాలి. చివరగా, బౌల్‌లో ఉన్న పదార్థాలన్నిటినీ బాగా కలుపుకొని సర్వ్‌ చేస్తే సరి.

దానిమ్మ తో క్యాన్సర్ నివారిణి:

దానిమ్మ గింజల వలన ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్క్ నివారించబడుతుంది. ఈ గింజలలో వుండే క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు కాన్సర్ కణాలు పాకకుండా, ఎక్కువగా పెరగకుండా, క్యాన్సర్ సోకిన కణాలు చనిపోయేలాగా పురిగొల్పుతాయి.

దానిమ్మ తో వాపులతో పోరాటం

దానిమ్మ గింజలను తినటం వలన వాపులు, వాపు సంబంధ సమస్యలతో పోరాటంలో సాయం లభిస్తుంది. అధ్యయనాల ప్రకారం శరీరంలో ఫ్రీగా తిరిగే హానికర రాడికల్స్ కారణంగా జరిగే ఆక్సిడేటివ్ నష్టాన్ని, వాపును దానిమ్మ గింజలు తగ్గిస్తాయి.

దానిమ్మ బరువు తగ్గడం

బరువు తగ్గాలనుకుంటే.. దానిమ్మ గింజలు ఎంతగానో సహాయపడతాయి. ఇవి బరువు తగ్గటంలో సాయపడతాయి. వాటిల్లో ఉండే పీచుపదార్థం చాలాసేపు వరకు మీ కడుపు నిండుగా వున్న ఫీలింగ్ కలిగిస్తుంది. దానిమ్మ గింజలు స్థూలకాయాన్ని కూడా నివారించి, కొవ్వును కరిగించటంలో సాయపడతాయి.

దానిమ్మ తినడం వల్ల కలిగే నష్టాలు..

దానిమ్మ తొక్క, వేరు లేదా కాండం అధిక వినియోగం మంచిది కాదు, ఎందుకంటే అందులో విషం ఉండవచ్చని పరిశోధకులు అంటున్నారు. తక్కువ రక్తపోటు ఉన్న రోగులు దానిమ్మ రసాన్ని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఎందుకంటే ఇది రక్తపోటును తగ్గించే గుణం కలిగి ఉంటుంది. విరేచనాలు అయినప్పుడు దానిమ్మ రసాన్ని తీసుకోకూడదు. చాలామంది చర్మసంరక్షణలో దానిమ్మరసం ఉపయోగిస్తుంటారు. అయితే చర్మంపై దానిమ్మ రసాన్ని రాసుకుంటే కొందరికి దురద, వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండవచ్చు.కాబట్టి దానిమ్మరసం లేదా దానిమ్మ గింజలు తినడంలో జాగ్రత్తగా ఉండాలి.

Also Read : గురువారం ఈ పని ఒక్కటి చేస్తే అకండ సంపద మే ఇంట్లోనే..

దానిమ్మ ఆకుల ఉపయోగాలు…

దానిమ్మ ఆకులతో ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. అనేక ఆనారోగ్య సమస్యలను ఈ ఆకులతో చెక్ పెట్టవచ్చు. ఆయుర్వేద వైద్యంలో వీటిని ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా చలికాలంలో జలుబు, దగ్గు, సమస్యతో బాధపడుతున్నవారు. గుప్పెడు దానిమ్మ ఆకులను తీసుకుని బాగా కడిగి తగినన్ని నీళ్ళు తీసుకుని బాగా మరిగించుకోవాలి. ఈనీటిని ఉదయం సాయంత్రం తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గిపోతాయి.కిడ్నీ, లివర్, వాంతులు, అరుగుదల సమస్యలు ఉన్నవారు దానిమ్మ ఆకులను సేకరించి నీడలో ఆరబెట్టుకోవాలి. ఆతరువాత దానిని పొడిగా చేసుకుని రోజుకు మూడు గ్రాముల చొప్పున తీసుకోవటం వల్ల సమస్యలను తగ్గించుకోవచ్చు. అధికబరువుతో బాధపడుతున్న వారు దానిమ్మ ఆకులతో తయారు చేసుకున్న టీని తాగటం వల్ల మంచి ఫలితం పొందవచ్చు.

జుట్టు రాలే సమస్య

జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు దానిమ్మ గింజలను తినటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జుట్టును బలంగా మార్చే కొవ్వు ఆమ్లం ప్యూనిక్ ఆమ్లం దానిమ్మలో ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. దానిమ్మ గింజలు మెదడులో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి. దానిమ్మలో ఉండే ఐరన్ కారణంగా హిమోగ్లోబిన్ స్ధాయిలు పెరుగుతాయి. రక్తహీనత నుండి కాపాడతాయి. కడుపు సంబంధిత సమస్యలైన విరేచనాలు, అతిసారం, కలరా వంటి సమస్యలను తగ్గించటానికి దానిమ్మ దోహదం చేస్తుంది.

దానిమ్మ పొడి చర్మానికే కాదు జిడ్డు చర్మానికి కూడా ఉపయోగపడుతుంది. జిడ్డు చర్మంపై కలిగే మొటిమలను, చర్మ పగుళ్లను, మచ్చలు మరియు దురదలను శక్తివంతంగా తగ్గిస్తుంది. దానిమ్మ పండులో ఉండే ‘ప్యూనిక్ ఆసిడ్’, చర్మ కణాల్లో ఉండే బ్యాక్టీరియా, మలిన పదార్థాలను తొలగించి చర్మాన్ని ఆరోగ్యంగా, మృదువుగా ఉంచుతుంది.దానిమ్మ చర్మ క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులను కూడా తగ్గిస్తుంది. దానిమ్మ పండులో ‘పాలీఫినాల్’, యాంటీ- ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల చర్మంపై ఏర్పడిన మంటలు, వాపులు తగ్గుతాయి. చర్మంపై ఏర్పడిన చిన్న చిన్న తెగుళ్లను, మచ్చలను తగ్గించుకోవడానికి దానిమ్మ గింజల నుండి తయారు చేసిన నూనెలు ఉపయోగపడతాయి.కాబట్టి దానిమ్మ పండును తినడం ద్వారా.. చాలా ఆరోగ్య సమస్యలు నయమవుతాయంటారు వైద్యనిపుణులు.

Leave a comment