Lemon | నిమ్మరసం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకోండి..!

Lemon | నిమ్మ‌కాయల వ‌ల్ల మ‌న‌కు ఎన్ని ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. వీటి ర‌సాన్ని తాగితే మ‌న‌కు ఎంతో మేలు జ‌రుగుతుంది. నిమ్మ‌ర‌సంలో ఉండే విట‌మిన్ సి మ‌న చ‌ర్మాన్ని సంర‌క్షించ‌డ‌మే కాకుండా రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. అలాగే ఇంకా ఎన్నో లాభాలు క‌లుగుతాయి.అలాగే వేసవి కాలంలో వేడి నుండి ఉపశమనం పొందడానికి నిమ్మకాయ నీటిని ఎక్కువగా తీసుకుంటారు. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

బరువును కూడా నియంత్రించటంలో సహాయపడుతుంది. జీర్ణ సమస్యలను తొలగించటంలో సహాయపడుతుంది.ఇంకా లెమన్ వాటర్ పదే పదే తాగడం వల్ల డీహైడ్రేషన్ తలెత్తే ప్రమాదం ఏర్పడుతుంది. నిమ్మకాయ నీటిని తాగినప్పుడు మూత్రం అధికంగా వస్తుంది. శరీరంలోని నీరు బయటకు వెళుతుంది. ఈ క్రమంలో శరీరంలోని అనేక ఎలక్ట్రోలైట్లు , సోడియం వంటి మూలకాలు మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. దీంతో డీహైడ్రేషన్ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది.

లెమన్ వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల పొటాషియం లోపం ఏర్పడుతుంది.నిమ్మ‌ర‌సం తాగితే ఎలాగైతే మ‌న‌కు ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో నిమ్మ‌తొక్క‌ల వ‌ల్ల కూడా అలాగే లాభాలు క‌లుగుతాయి. అయితే నిమ్మ‌తొక్క‌ను నేరుగా తిన‌లేని వారు దాన్ని ఎండ బెట్టి పొడి చేసి ఉప‌యోగించ‌వ‌చ్చు. లేదా దాన్ని కూడా జ్యూస్‌లా చేసి తీసుకోవ‌చ్చు. ఇలా నిమ్మ‌తొక్క‌ల‌ను తీసుకోవ‌చ్చు. ఇక ఈ తొక్క‌ల్లో నిమ్మ‌ర‌సం కంటే కూడా విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది. ముఖ్యంగా విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, డి-లైమోనీన్‌, బీటా కెరోటిన్, సిట్రిక్ యాసిడ్‌, మాలిక్ యాసిడ్‌, హెస్పెరిడిన్ అనే పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి. అలాగే నిమ్మ‌తొక్క‌ల్లో కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం కూడా ఎక్కువ‌గానే ఉంటాయి. క‌నుక ఇవి మ‌న‌కు లాభాల‌ను అందిస్తాయి.

నిమ్మరసం వలన సైడ్ ఎఫెక్ట్స్..

నిమ్మకాయ నీటిని అధికంగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట వస్తుంది. ఎందుకంటే ఇది ప్రోటీన్ విడగొట్టే ఎంజైమ్ అయిన పెప్సిన్‌ని సక్రియం చేస్తుంది. అలాగే శరీరంలోని అనేక ఎలక్ట్రోలైట్లు , సోడియం వంటి మూలకాలు మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. దీంతో డీహైడ్రేషన్ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. లెమన్ వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల పొటాషియం లోపం ఏర్పడుతుంది.అలాగే నిమ్మ రసం తరుచూ తాగుతుంటే అధిక మొత్తంలో విటమిన్ సీ రక్తంలో ఐరన్ స్థాయిని పెంచుతుంది. ఇది ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో అంతర్గత అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.దానితో పాటు నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. నిమ్మకాయలో ఎసిడిటీ ఉంటుంది. దీని వల్ల ఎముకలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

Also Read : ఒక సపోటా పండుతోఇన్ని రోగాలు పోతాయ..

నిమ్మ తొక్కలో లాభాలు

నిమ్మ తొక్కలో ఉండే ఈ ఆంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే విష వ్యర్ధాలను తొలగిస్తాయి.అలాగే వాపుకు కారణమైన ప్రీ రాడికల్ ఎలిమెంట్స్ తో పోరాడుతాయి.నిమ్మ తొక్కులో విటమిన్ సి పుష్కలంగా ఉండడం వలన ఇది తక్కువ తీపి సూచికను కలిగి ఉంటుంది.దీంతో ఇది శరీరంలో ఉండే అధిక చక్కెర స్థాయిలో నియంత్రించి మధుమేహం వ్యాధిని అదుపులో ఉంచుతుంది.ఇక ఈ స‌మ్మేళ‌నం యాంటీ ఆక్సిడెంట్‌లా ప‌నిచేస్తుంది. దీని వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

క్యాన్స‌ర్ క‌ణాలు నాశ‌నం అవుతాయి. డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.డి-లైమోనీన్ శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. క‌నుక ఫ్రీ ర్యాడిక‌ల్స్ నాశ‌నం అవుతాయి. దీంతో వాపులు తగ్గుతాయి. నిమ్మ‌తొక్క‌ల్లో ఉండే విట‌మిన్ సి శ‌రీరంలో యాంటీ బాడీల‌ను ఉత్ప‌త్తి అయ్యేలా చేస్తుంది. దీంతో తెల్ల ర‌క్త క‌ణాల సంఖ్య పెరుగుతుంది. ఇది రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టంగా చేస్తుంది. ఇక నిమ్మ‌తొక్క‌లు కాస్త చేదుగా ఉంటాయి. కానీ వాటిని పొడి లేదా జ్యూస్ రూపంలో తీసుకోవ‌చ్చు. లేదా నిమ్మ తొక్క‌ల‌ను వేసి టీ త‌యారు చేసి కూడా తాగ‌వ‌చ్చు.

లెమన్ టీ వలన.

వర్షాకాలంలో జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ సమయంలో లెమన్ టీ తీసుకోవాలి అంటున్నారు. ఎందుకంటే ఇది జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. నిమ్మకాయలోని డైటరీ ఫైబర్​ గట్ సమస్యలను తగ్గిస్తాయి. ఆకలిని కంట్రోల్ చేస్తాయి. బరువు తగ్గడానికి కూడా ఇది మంచి హెల్ప్ అవుతుంది. మెరుగైన మెటబాలీజం అందించి.. కేలరీలను వేగంగా బర్న్ చేయడంలో హెల్ప్ చేస్తుంది.

ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. అలాగే ఆరోగ్యంగా ఉండాలంటే.. రోగనిరోధక వ్యవస్థ చాలా ఇంపార్టెంట్. లెమన్​టీ ఇమ్యూనిటీని పెంచుతుంది. దీనిలో విటమిన్ సి చాలా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. అంటు వ్యాధులను, ఇతర ఇన్​ఫెక్షన్లను దూరం చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లతో నిండిన లెమన్ టీ.. మీకు పలు ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే డీసీస్ నుంచి ఉపశమనం అందిస్తుంది.

ఇవేకాకుండా యూరిన్ ఇన్​ఫెక్షన్లు రాకుండా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా లెమన్ టీ స్ట్రెస్​ని తగ్గిస్తుంది. తలనొప్పిని దూరం చేసి.. రిలాక్స్​గా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. నిరాశ, ఆందోళనను దూరం చేస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. దాని వాసన కూడా పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది. రిఫ్రెష్​గా ఉండేలా చేస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్తున్నారు నిపుణులు.

నోటి దుర్వాసన..

కొన్నిసార్లు నోరు దుర్వాసన వస్తుంటుంది. అలాంటప్పుడు నిమ్మ తొక్కల్ని మొత్తం రసం పిండేసి ఒక్కసారి దంతాలపై రుద్దండి. మరీ ఎక్కువ వద్దు.. ఒక్కసారి అలా రుద్ది వదిలేయండి. దీని వల్ల మరకలు తగ్గుతాయి. దంతాలు క్లీన్ అవుతాయి.

Leave a comment